Saturday, 7 November 2026

ధరణి వద్దు , పాత పద్ధతే ముద్దు :- ఇందూర్ చంద్ర శేఖర్

ధరణి వద్దు , పాత పద్ధతే ముద్దు :- ఇందూర్ చంద్ర శేఖర్

రుద్రూర్ (జనంసాక్షి):
కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు
రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు ధరణి పోర్టల్ అవకతవకల పై రుద్రూర్ మండల తహసీల్దార్ ముజీబ్ కు మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను తెలిపారు ధరణీ వెబ్సైట్ పేరుతో భూ రికార్డులను నిర్వహించే బాధ్యత ఒక విదేశీ కంపెనీకి అప్పజెప్పడం . కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని. ధరణి కి ముందు రికార్డుల నిర్వహన పూర్తిగా (చీప్ కమిషనర్ లాండ్ అడ్మినిస్ట్రేషన్) అధీనంలో ఉండేవి అని ఇప్పుడు కూడా అదే విధానాన్నే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంటని జాబితా నుంచి తొలగించి గ్రామ పంచాయతీ సభలో ఆయా గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చెయ్యాలని డిమాండ్ చేశారు.

అటవీ భూములను 2006 లో తెచ్చిన అటవీ భూముల హక్కు చట్టం ప్రకారం అందరికీ భూమి హక్కు కల్పించాలని.

కాంగ్రెస్ హాయాంలో పేదలకు అసైన్డ్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారులకే ఉండే హక్కుకు సమానంగా అసైన్డ్ భూములకు కూడా హక్కు కల్పించాలని. ఆ విధంగా చట్ట సవరణ చెయ్యాలని సూచించారు.

కౌలు చేసుకునే రైతులకు హక్కు కలిగించే విధంగా గ్రామ స్థాయిలో కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థ తీసుకురావాలిని కోరారు

2004 లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పాలసీని అమలు చేయడానికి ప్రతి ఎకరం సర్వే చేసి రైతుల భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించి రాష్ట్ర శాసన సభలో వెంటనే భూమి టైటిల్ గారంటీ చట్టం తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ మరియు మండల నాయకులు కర్క అశోక్, అరుణ్ పటేల్, పట్ల సురేష్, కాసుల ఉమామహేశ్వర్, శ్రీను మరియు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు…