తిరుమల, ఫిబ్రవరి 25 : తిరుమల శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం కరకంబాడి అటవీ ప్రాంతం నుంచి వ్యాపించిన మంటలు మొదటి ఘాట్ రోడ్డులోని పదవ మలుపు నుంచి 8వ మలుపు వరకు విస్తరించాయి. దాదాపు కిలో మీటర్ మేర మంటలు విస్తృతంగా ఎగిసిపడుతున్నాయి. వెంటనే అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళం ప్రాంతం నుంచి కూడా మంటలు వ్యాపిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.




