Thursday, 5 November 2026

తిలక్ నగర్ లో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

తిలక్ నగర్ లో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
హుజూర్ నగర్ డిసెంబర్ 6 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని తిలక్ నగర్ లో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ పెద్దలు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ వలననే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చాయని, ప్రతి మహిళ ప్రతి వ్యక్తి చదువుకోగలుగుతున్నారని, ఉన్నత స్థాయికి వెళ్లి గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని, ఓటు హక్కును కల్పించారని భారత రాజ్యాంగాన్ని అందరికీ సమాన హక్కులను కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ కొమ్మ యోనా, కోలపూడి దయాకర్, కుడి తొట్టి ఇర్మియా, మామిడి ఇమ్మానుయేలు, కోల్లపూడి డేవిడ్, కోల్లపూడి కాంతయ్య, కొమ్ము మధు, మామిడి అశోక్ కుమార్, నిర్మల్, వేముల బాలరాజు, గోపి, మామిడి అనిల్ , సైదులు, కుడితొట్టి హరీష్, కుడుతొట్టి విజయ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.