నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ.
బెల్లంపల్లి, డిసెంబర్ 6, (జనంసాక్షి )
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్బంగా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి మాట్లాడుతూ ప్రపంచ మేధావి, సామాజిక ప్రజాస్వామ్య వైద్యుడు, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ నిర్మాత, నవ భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లిలోని నిరుపేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బని రాజనర్సు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భీమశంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి జయ, నియోజకవర్గ అధ్యక్షురాలు లింగాల అమృత, బెల్లంపల్లి పట్టణ గౌరవ అధ్యక్షుడు చీటిపోషం, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కొప్పుల రవళి, పట్టణ కార్యదర్శి ఇచ్చకూడా పుల్లయ్య, బడికిల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ.




