Wednesday, 4 November 2026

తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలి

తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ జర్నలిస్టులు నిరసన
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందివేత
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చి 25 (జనం సాక్షి)అక్రమంగా అరెస్టు చేసిన క్యూ న్యూస్ అధినేత,సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను వెంటనే విడుదల చేయాలని  క్యూ న్యూస్ఇబ్రహీంపట్నం ఇంఛార్జి గుండె రాఘవేందర్ అధ్యర్యంలో ఇబ్రహీంపట్నం జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ,నిరసన తెలిపారు.ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహించి,అంబేద్కర్ కి వినతి పత్రం  ఇబ్రహీంపట్నం జర్నలిస్ట్ లు అందజేసారు.జర్నలిస్టులపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని,తీన్మార్ మల్లన్న బేషరతుగా విడుదల చేయాలన్నారు.ప్రశ్నించే గొంతుక నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ వైఖరి మారాలి.మీడియా సంస్థలపై దాడులు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. మల్లనన్ను వెంటనే విడుదల చేయాలని,లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి,రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని  జర్నలిస్టులు నాయకులు చెరుకూరి మహేందర్, రాఘవేందర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సూరమోని సత్యనారాయణ సాగర్,చెరుకూరి మహేందర్ చీమల కృష్ణ యాదవ్,చెరుకూరి మల్లేష్,సోప్పరి యాదగిరి,ముచ్చర్ల నాగేష్,అలంపల్లి సురేష్,హనుహంతు సుదర్శన్,కే యాద కృష్ణ, నల్లోల్ల రవీందర్,కావలి భార్గవ్, పి సుదర్శన్,ఎస్ బాబు సాగర్,పి క్రాంతి,నరేందర్ రెడ్డి,ఎం కార్తీక్,బి దశరథ,కే నాగేష్,మహేందర్,సిహెజ్ రాజు ,పి శ్రీను,అంజి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.