Wednesday, 4 November 2026

తుంకుంటలో నూతన మల్లన్న గుడి నిర్మాణానికి శంఖు స్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి

: శామీర్ పేట్, జనం సాక్షి :తుంకుంట మున్సిపాలిటీలోని పరిధి లో యాదవ సంఘం అధ్యక్షుడు ఎద్దు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన మల్లన్న గుడి నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి భూమి పూజలో పాల్గొన్నారు . ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…మల్లన్న గుడి నిర్మాణానికి 5 లక్షలు తన స్వంత నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లన్న దేవుడు తనకు ఆరాధ్య దేవుడని ప్రతి సంవత్సరం కొమురవెల్లి మల్లన్నను దర్శించు కుంటానని తెలిపారు. మల్లన్న ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని అన్నారు.యాదవులంతా కలిసికట్టుగా మల్లన్న గుడిని మార్బుల్ రాయి తో నిర్మించుకుంటే చాలా బాగుంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో తుంకుంట చైర్మన్ రాజేశ్వర్ రావు,కౌన్సిలర్ రాజు యాదవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగేష్ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్,భరత్ సింగ్, కృష్ణారెడ్డి, శ్రీశైలం యాదవ్,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.