Thursday, 5 November 2026

తుంకుంట మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు రాంచందర్ యాదవ్ రాజీనామా

: శామీర్ పేట్, జనం సాక్షి : బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కారులను అడుగడుగునా అవమానాలపాలు చేస్తున్నందుకే పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తుంకుంట మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్, ఉద్యమ నాయకుడు చిర్ర బోయిన రాం చందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తుంకుంట మున్సిపాలిటీ లోని మొగుళ్ళ రామకృష్ణ రెడ్డి ఫంక్షన్ హలులో విలేకరుల సమావేశంలో రాం చందర్ యాదవ్ మాట్లాడుతూ…2001 టి ఆర్ఎస్ పార్టీ ఆవిర్భా వించినప్పటి నుండి కేసీ ఆర్ తోనే అనేక ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చు కున్నమ్మన్నారు. మంత్రి మల్లారెడ్డి రెడ్డి వర్గంకు కొమ్ముకాస్తు బిసి, ఎస్సీ, ఎస్టీ లను పార్టీలో ఎదగా నీయకుండా అడుగడుగునా అవమానాలు చెయ్యడం సిగ్గు చేటని అన్నారు. ఉద్యమకారులను పార్టీ సమావేశాలల్లో మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని మండి పడ్డారు.వలసవాదులతో ఉద్యమ ద్రోహుల పార్టీగా అవతరించిందన్నారు. తన రాజీనామా పత్రాన్ని బి ఆర్ భవన్, మంత్రి మల్లారెడ్డి, తుంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డిలకు ఫ్యాక్స్ ద్వారా పంపిస్తానని పేర్కొన్నారు.రాబోయే వారం రోజుల్లో 2000 మంది అనుచరులతో తుంకుంటలో పెద్ద బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరాతనని పేర్కొన్నారు