Tuesday, 3 November 2026

తుమ్మెనాల గ్రామం నందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిసిఎంఎస్ చైర్మన్

 

 

 

 

 

 

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామం నందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్(KDCMS) ఆధ్వర్యంలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రం DCMS చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి చేతులమిదుగ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వరి ధాన్యము గ్రేడు “ఏ” రకము రూ. 2060/-, సాధారణం రకము రూ.2040/- అని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని  తెలిపారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ అయ్యేరి రాజేష్ కుమార్,గ్రామ MPTC సర్పంచ్, ఉప సర్పంచ్, సాయికుమార్, నరేష్, వార్డు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.