వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 29 (జనం సాక్షి) హనుమకొండ లోని కాజిపేట్, సోమిడి లోని తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ముఖ్యఅతిథిగా చైతన్య యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ దామోదర్, ప్రత్యేక అతిథులుగా షణ్ముఖ చారి విచ్చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు చిత్ర సీమ గాయని, ఆస్కార్ అవార్డున సొంతం చేసుకున్న త్రిబుల్ ఆర్ లోని కొమ్మ ఉయ్యాల పాడిన ప్రకృతి రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన యొక్క పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ దామోదర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సునిశితమైన విషయ పరిజ్ఞానం అందించే రీతిలో అన్ని రకాల పోటీ పరీక్షలకు తట్టుకొని నిలబడే విధంగా ఒలంపియాడ్ కరికులంతో పిల్లలకి విద్యను అందిస్తున్న తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ నగర ప్రజలకు ఒక చక్కటి కానుకగా అభివర్ణించారు.
విద్యతోపాటు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే విధంగా అన్ని రకాల క్రీడా ప్రాంగణములతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనందిస్తున్న తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ గుణాత్మకమైన విద్యకు చిరునామాగా నిలిచిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు తమ యొక్క పాటలతో నృత్యాలతో నాటిక ప్రదర్శనలతో వచ్చిన ప్రేక్షకులను తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించారు.
పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా ఒలంపియాడ్ కరికులంతో విద్యా బోధనను వరంగల్ ప్రాంతీయులకు అందించాలనే సంకల్పంతో తమ పాఠశాలను స్థాపించడం జరిగిందని మునుముందు మరిన్ని నూతన కార్యక్రమాలతో తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీనిస్తూ పాఠశాల చైర్మన్ శ్రీ తాళ్ల మల్లేశం గారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తాళ్ల పద్మావతి విద్యాసంస్థల డైరెక్టర్స్ డాక్టర్ వంశీ -చైతన్య, డాక్టర్ వరుణ్ – వైష్ణవి, తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ .వేలు, తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.వి.ఆర్, పాఠశాల కోఆర్డినేటర్ అఫ్జల్ ఉన్నిసా, శ్రవణ్, స్వర్ణ, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు ఇంకా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




