Thursday, 5 November 2026

తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ…
బోథ్ (జనంసాక్షి)
సోనాల స్థానిక ఎస్సీ కాలనీలో పేద వృద్ధ మహిళలకు తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తుల అజయ్ కుమార్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మహిళలకు వృద్ధులకు చలి నుంచి కాపాడుకోవడానికి తమ వంతు సహాయంగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినందుకు వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమృత్ రావ్ పాటిల్, వార్డ్ సభ్యులు జోష్ణ సంతోష్, చెట్లపేల్లి సుధీర్ కుమార్, స్థానిక యువకులు భీంరావ్ పాటిల్, బీ.రవీందర్, లక్ష్మణ్, తదితరులు మహిళలు వృద్ధులు పాల్గొన్నారు.