Thursday, 5 November 2026

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు

*అక్రమ అరెస్టులకు భయపడేది లేదు *

కరకగూడెం:(జనంసాక్షి);రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తే అరెస్టులు, బెదిరింపులకు పాల్పడతారా? వాటికి మేము భయపడేది లేదని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి పోలీసు తమను ముందస్తు చర్యలలో భాగంగా పోలీస్స్టేషన్ తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేస్తున్నా అరాచకాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడు పైన ఉందని అరెస్టులతో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై చేస్తున్న పోరాటాలను ఆపలేరని అన్నారు అరెస్ట్ అయిన వారిలో ఇక్బాల్ హుస్సేన్, తోలెం నాగేశ్వరరావు, పోలిపోయిన శ్రీవాణి, అలేం కోటి తదితరులు ఉన్నారు.