Monday, 2 November 2026

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి

 తూప్రాన్ జూన్ 1:( జనం సాక్షి )::: తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పొంది రాఘవేంద్ర గౌడ్ 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని ఉన్నత పదవులు అలంకరించి ప్రజా సేవలో ఉంటూ అందరి మన్ననలు పొందాలని దేవుని ప్రార్థించినట్లు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ జన్మదిన సందర్భంగా బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ జగ్జీవన్ రావు విగ్రహాల ఆవరణలో మరియు తూప్రాన్ మున్సిపల్ ఆవరణలో జరిగిన జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ 9 గంటల పరిపాలనలో గజ్వేల్ నియోజకవర్గం 9 ఏళ్లలో 100 సంవత్సరాల అభివృద్ధి జరిగిందని అన్నారు రాఘవేంద్ర ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు పనులు జరిగాయన్నారు 50 పడకల ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపల్ భవనం గోడౌన్ల నిర్మాణం హలో భవనాలను నిర్మించిన ఘనత దక్కుతుందని అన్నారు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్రస్థాయిలో నాయకుడుగా ఎదగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి , శివంపేట జడ్పీటీసీ మహేష్ గుప్త తూప్రాన్ మున్సిపల్,కమిషనర్ మోహన్, ఏఈ సాయిరాం రెడ్డి,కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, సత్య లింగం, దుర్గా రెడ్డి, పల్లెర్ల రవీందర్ గుప్త, భగవాన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, ర్యాకల కృష్ణ గౌడ్,బుక్క విజయ్, లంబ రాజు యాదవ్,పసుల నర్సింగ రావు, రాజు,పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది టిఆర్ఎస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు