బెల్లంపల్లి, జూన్ 1,( జనంసాక్షి )
నేటి నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి బెల్లంపల్లి పట్టణంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, 3న తెలంగాణ రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం, 5న తెలంగాణ విద్యుత్ విజయోత్సవ దినోత్సవం, 6న తెలంగాణ పారిశ్రమిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరురా చెరువుల పండగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం, 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజన దినోత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న తెలంగాణ విద్యా దినోత్సవం, 21న తెలంగాణ అధ్యాత్మిక దినోత్సవం, 22న తెలంగాణ అమరుల సంస్మరణకార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డివో శ్యామల దేవి, నియోజకవర్గంలోని సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.




