Tuesday, 3 November 2026

తృతీయ ప్రత్యామ్నాయం ఎండమావే : వెంకయ్య

హైదరాబాద్‌ : దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం ఎండమావేనని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ఇక యూపీఏ సర్కార్‌ పాలనకు ఇదే చివరి సంవత్సరమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను కూడా ఈ ప్రభుత్వం ఓటుబ్యాంకుగా వాడుకుంటోందని వెంకటయ్యనాయుడు దుయ్యబట్టారు.
ప్రపంచ దేశాల దృష్టిలో భారత ప్రభుత్వం అచేతనమైందనే సంకేతాలు వెళ్లాయన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *