చిలుకూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జానపద కళలను ప్రోత్సహించాలిన కోదాడ ఎమ్మెల్యే వేలేపల్లి చందర్‌రావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బిల్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మహిళా కోలాటాలు, గజ్జె పూజలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు కోలాటాలు వేయడం హర్షణీయమన్నారు. ప్రతీ జానపద కళాకారుడికి ప్రభుత్వం పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చందర్‌రావు రూ. 20వేల విలువైన దుస్తులను మహిళలకు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు నలబోలు శ్రీనివాసరెడ్డి ఓరుగంటి వెంకటేశ్వర్లు రూ.12వేల విలువైన గజ్జెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్, మండల అధ్యక్షుడు కడియాల వెంకటేశ్వర్లు , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొల్లు బ్రహ్మంచౌదరి, గ్రామ ఉపసర్పించి మద్ది వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




