.
-డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్.
-తెనుగొళ్ళు జిల్లా భవన సాధన కమిటీ సమావేశం.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి23(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లాలో తెనుగొళ్ళు జాతి ఉన్నతికై అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెనుగొళ్ళు జిల్లా భవన సాధన కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ పిలుపునిచ్చారు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో గంగా భవాని దేవాలయంలో మత్స్య సహకార సంఘం తాలూకా అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు ఆద్వర్యంలో జరిగిన తెనుగొళ్ళు జిల్లా భవన సాధన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ మాట్లాడుతూ తెనుగొళ్ళు జాతి సంఘటితం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.మన ఆత్మ గౌరవం కార్య క్రమాలు చేపట్టేందుకు, జిల్లా కేంద్రంలో భవన నిర్మాణం చేపట్టడానికి అందరూ కలిసి రావాలని కోరారు.గ్రామ గ్రామాన జాతిని చైతన్య పరుస్తూ సమాజంలో అగ్రస్థానంలో నిలిపేలా ప్రతి తెనుగు బిడ్డ కృషి చేయాలని అన్నారు.తెనుగు జాతి పిల్లలకు విద్యా ఉద్యోగా పరంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.తెనుగు జాతి అభ్యున్నతికి ఘ
పండుగొళ్ళ సాయన్న పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.దీనికి జిల్లాలోని తెనుగొళ్ళ జాతి ఉద్యోగులు కూడా ముందుకు రావాలని కోరారు. త్వరలో భవన సాధన జిల్లా కమిటీ ని వేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశ అనంతరం ఎల్ఐసి ఏజెంట్ సందు యాదగిరి ఆద్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా తెనుగొళ్ళు భవన సాధన కమిటీ సభ్యులు సందు యాదగిరి, గూళ్ళ హరికృష్ణ,యానమోని తిరుపతయ్య, గొడుగు సహదేవుడు, కొల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, వివిధ గ్రామాల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
-తెనుగొళ్శ జాతి ఉన్నతికై కలిసి నడవాలి




