– బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి.
నెన్నెల, జనవరి 23, (జనంసాక్షి )
కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి అన్నారు. సోమవారం ఆమె మండలం లోని ఆవడం గ్రామంలోని కంటివెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీగా ఎంత మందికి పరీక్షలు చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటివెలుగు పరీక్షల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ఆమె వెంట కంటివెలుగు మెడికల్ ఆఫీసర్ భవాని, వైద్య సిబ్బంది ఉన్నారు.
కంటివెలుగు పకడ్బందీగా నిర్వహించాలి.




