తెరాస అధ్వర్యంలో కేసిఆర్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 12:
రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా సంక్షేమ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహానికి ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి రాఖీ కట్టి మండల ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు అని పేర్కొన్నారు. షీ టీమ్స్ ద్వారా మహిళా రక్షణ,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,ఒంటరి మహిళలకు,వృద్దులకు ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని,రాష్ట్ర మహిళా లోకం కేసిఆర్ కు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి,వైస్‌ఎంపీపీ బేతి రాజిరెడ్డి,సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణరెడ్డి,మండల జెనరల్ సెక్రటరీ మంకు శ్రీనివాస్ రెడ్డి,మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు,సర్పంచ్ లు పెద్దపల్లి భవాని-అరుణ్ పటేల్,పిట్టల రజిత శ్రీనివాస్, సుందరగిరి ఆలయ చైర్మన్ తాళ్లపల్లి సంపత్ గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు గీట్ల తిరుపతి రెడ్డి,బోయిని రమేష్,కత్తుల రమేష్,విద్యార్ధి విభాగం ఉపాధ్యక్షులు ముస్కుల అవినాష్ రెడ్డి, సోషల్ మీడియా మండల కన్వీనర్ బొట్ల రవీందర్,నాయకులు పెద్దపల్లి పవన్,తోట శ్రీనివాస్,పిల్లి రమేష్,బత్తుల వెంకటేష్,దేశిని రాజయ్య ,చీకుట్ల రాజు,అందే బాబు,బోయిని యాదయ్య,మహిళలు సరవ్వ, బాలవ్వ, కనుకవ్వ, పుష్పలత,లచ్చవ్వ, స్వప్న, దేవేంద్ర, దుర్గవ్వ, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.