హైదరాబాద్ : టీడిపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ట తెరాస అధినేత కేసీఅర్, అపార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్రావు, కేటీఅర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పీసీసీ చీఫ్ బోత్స కుమార్తె పెళ్లికి హజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు, తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్ధన్రెడ్డిలు తమ సంతాపాన్ని తెలియజేశారు. వివాహ కార్యక్రమంతో పాటు ఎర్రన్నాయుడు భౌతికకాయాన్ని సందర్శించినట్లు వారు తెలిపారు.




