తెరాస ప్రభుత్వంతోనే అభివృద్ధి.
మన ఊరు మన బడి నిర్మాణానికి భూమి పూజ.
వైస్ ఎంపీపీ ధవులే బాలాజీ.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని షాంపూర్ గ్రామంలో మన ఊరు మన బడి నిర్మాణం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ఆదేశాల మేరకు మన ఊరు మన బడి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఒక్క కోటి రూపాయలతో నిర్మిస్తున్న నిర్మాణానికి భూమి పూజ వైస్ ఎంపీపీ ధవులే బాలజీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో ప్రతి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా తెరాస ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లిక పాఠశాల చైర్మన్ అశోక్ వైస్ చైర్మన్ ఆశ జడి మల్లయ్య కాటం రమేష్ ఉపాధ్యాయులు చంద్ర శేఖర్ తదితరులు ఉన్నారు




