Wednesday, 4 November 2026

కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కేర్ల యాదయ్య

ఆత్మకూర్ (ఎం) డిసెంబర్ 3 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆత్మకూర్ మండల మహాసభలు మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య జిల్లా కార్యదర్శి దొడ్డి స్వామి జిల్లా సాంస్కృతిక కమిటీ కన్వీనర్ కట్ట రమేష్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కొణతం శ్రీనివాస్ సీనియర్ నాయకులు దడిపెళ్ళి వెంకన్న విచ్చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీపీఎస్ విధానం ఎగ్జిట్ పాలసీ కాదని ఒకవేళ రాష్ట్రాలు సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీసీ విధానాన్ని పునరుద్ధరించినా ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సీపీఎస్ ఖాతాలలో దాచుకున్నటువంటి డబ్బు తిరిగి రాదు అని అనడం చాలా దుర్మార్గం అని అన్నారు ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకుండా ఎఫ్ఎల్ఎన్ అమలు చేయడం సాధ్యం కాదు కావున తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని తక్షణమే ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 317 జీవో వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు ప్రతి పాఠశాలలో స్కావెంజర్లు నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం ఆత్మకూర్ నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి దొడ్డి స్వామి ఎన్నికల పరిశీలకులుగా జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య వ్యవహరించారు ఆత్మకూర్ మండల అధ్యక్షులుగా దర్శనం వెంకన్న ప్రధాన కార్యదర్శిగా జూకంటి కరుణాకర్ ఉపాధ్యక్షులుగా ఎలిమినేటి సోమయ్య మహిళా ఉపాధ్యక్షులుగా సురకంటి అనిత కోశాధికారిగా దొడ్డి రవి వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక కన్వీనర్ గా కప్పల రవి ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బిక్షం ఆడిట్ కమిటీ సభ్యులుగా జెల్ల నరహరి అకాడమిక్ కమిటీ కన్వీనర్ గా ముత్యం అశోక్ సాంస్కృతిక కమిటీ కన్వీనర్ పులిగిల్ల నర్సయ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం వెంకన్న జూకంటి కరుణాకర్ లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు