ఏటూరునాగారం జనంసాక్షి; జులై 07. రోజున ఆదివాసీ సర్పంచుల పోరం రాష్ట్ర అధ్యక్షుడు, ఈసం
రాంమూర్తి, ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, వరంగల్ కు విచ్చేస్తున్న ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు ఏం అభివృద్ధి చేసి, మళ్ళీ ఏం హామీ ఇస్తామని వస్తున్నారు.
బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది,
వరంగల్ టెక్స్టైల్స్ పార్కు ఏమైంది,ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది,ఇది వరకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. తెలంగాణ ప్రజలు మిమ్ములను నమ్మేటట్లు లేరు,ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు అమలుకాలేదు.ములుగు సమ్మక్క-సారలమ్మ జాతర జాతీయ హోదా ఏమైంది,
సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు విద్యార్థులకు ఏమైంది,ఈ రోజు సామాన్య మానవుడు మీరు పెంచిన అధిక ధరలకు వస్తువులు కొని, జీవించలేని పరిస్థితికి తీసుకొనివచ్చారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణకు ఒక న్యాయం? గుజరాత్ కో న్యాయమా? గుజరాత్ కి
ప్రధానమంత్రి కాదు కాదా? దేశ ప్రధానివి? మీ నోట నుండి ఏ పదమైతే వస్తుందో అమలు
కావాలని కానీ, మీ హోదాకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం ప్రధానమంత్రి పదవికే
కలంకం. మోడీ గారూ అంటే ఆదివాసుల మీద ప్రేమ ఉంది, గౌరవం ఉంది అనుకున్నాము.
మేము మా ఆదివాసీకి రాష్ట్రపతి పదవి ఇచ్చినందుకు సంతోషించినాము. కానీ నూతన పార్లమెంట్
భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలువకపోవడము, ఆదివాసి బిడ్డను అగౌరవ పరచినట్లు
కాదా? భారతదేశ ఆదివాసీలను అగౌరవ పరచినట్లు కాదా? దీనిపై ఆదివాసీలకు ఏం సమాధానం చెప్తారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏం చేస్తున్నది దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా,వరంగల్ కు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్పుడే నిన్ను తెలంగాణ ప్రజలు నమ్ముతారని, లేకుంటే కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ప్రజలు సరియైన సమయంలో సరియైన సమాధానం చెప్తారని డిమాండ్ చేస్తున్నాము.




