Wednesday, 4 November 2026

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం..!

జనం సాక్షి కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్
మండలంలోని కమాన్ పూర్, పెంచికల్ పేట్ గ్రామాలకు చెందిన గొల్ల, కురుమలకు రెండో విడతలో భాగంగా 12 యూనిట్ల గొర్రెలను శుక్రవారం ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా గొర్రెలను పంపిణీ చేశారు. కమాన్ పూర్ గ్రామానికి 6 యూనిట్లు, పెంచికల్ పేట్ గ్రామానికి 6 యూనిట్లు పంపిణీ చేశారు. ఒక్కోక్క యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష 75 వేలు కెటాయించింది. ఇందులో 20 గొర్రెలు, ఒక్క పొట్టేలును పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి విధితమే. అలాగే మండలంలో రెండో విడతలో 370 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 12 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఇక మిగితా లబ్ధిదారులకు కూడ త్వరితగతిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని మండల పశువైద్యాధికారి కొండె మహేందర్ తెలిపారు. ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నీలం సరిత, కొండ వెంకటేష్, ఉప సర్పంచులు బొజ్జ రాజసాగర్, లింగాల కుమార్, ఎంపిటిసి గొడిసెల ఉమా – సంపత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, మండల పరిషత్ కో- ఆప్సన్ సభ్యులు ఎండి ఇంతియాజ్, కురుమ సంఘం అధ్యక్షులు సరిగే మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెండ్లి నారాయణ, ఆకుల గట్టయ్య, గడప కృష్ణమూర్తి, నీల రాజయ్య, దండే కిషన్, జంగపల్లి లక్ష్మణ్, దండే కనకరత్నం, పిడుగు అంజి, బొల్లపల్లి శంకర్ గౌడ్, సింగం శ్రీనివాస్, పిట్టల స్వామి, సాన సురేష్, కురుమ సంఘం నాయకులు తూండ్ల ఐలయ్య, దయ్యాల రాజయ్య, కొమ్ము మల్లేష్, గోపు మహేందర్, కొమ్ము శ్రీనివాస్, సాన కొమురయ్య, దుర్కి పర్వతాలు, కోరే ఐలయ్య, దుర్కి కుమార్, నరిగే కుమార్, కొమ్ము సతీష్, దుర్కి హరీష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.