.తెలంగాణకు కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు

` దేశానికి ఒక్క మంచి పనీ చేయని మోదీ ప్రభుత్వం
` వ్యాట్‌ను కాదనండతో ఆదాయం కోల్పోయాం
` జిఎస్టీతో కేంద్రానికే ఎక్కవు మొత్తంలో చెల్లిస్తున్నాం
` బలహీనమైన రాష్టాల్రు ఉండాలన్నదే బిజెపి కోరిక
` అసెంబ్లీలో చర్చ సందర్భంగా తూర్పారాబట్టిన హరీష్‌ రావు
హైదరాబాద్‌(జనంసాక్షి):దేశం కోసం వ్యాట్‌ను కాదని, జిఎస్టీని ఆమోదించడం వల్ల తెలగాణ పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోయిందని ఆర్థికమంత్రి హరీష్‌ రావు అన్నారు. వ్యాట్‌ ఉండివుంటే మరింత ఆదాయం రాష్టాన్రికి సమకూరేదని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగేవని అన్నారు. అయితే దేశ సంక్షేమాన్ని కాక్షించి కేంద్రం తీసుకుని వచ్చిన జిఎస్టీని ఒప్పుకుని, పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయామని అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రం రాష్టాన్రికి నిధులు ఇవ్వడం లేదని.. తెలంగాణ ప్రజలే కేంద్రానికి నిధులు ఇస్తున్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కేంద్రం నుంచి రాష్టాన్రికి లక్షా 96 వేల కోట్ల నిధులు వస్తే..రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి 3 లక్షల కోట్లకుపైగా కట్టిందన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్టాన్రికి లక్షా 5 వేల కోట్ల బకాయిలు రావాల్సివుందని చెప్పారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం అప్పుల్లో పంజాబ్‌ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందన్నారు. కేంద్రం అప్పు కోటీ 52లక్షల 17వేల కోట్లుగా ఉందని..అంటే ప్రతి పౌరుడిపై లక్షా 25వేల అప్పు ఉన్నట్లు హరీష్‌ రావు చెప్పారు. తెలంగాణ అప్పు 3లక్షల 29వేల కోట్లు అన్న మంత్రి..రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై 94వేల రూపాయల అప్పు ఉందని చెప్పారు. రాష్ట్రం ఆదాయం రెట్టింపు అయ్యిందని చెప్పారు. ఈ సందర్బంగా కేంద్రం తీరును ఆయన దుయ్యబట్టారు. బలహీన రాష్టాల్రు, బలమైన కేంద్రం ఉండాలని కోరుకుంటోందని మండిపడ్డారు. దేశంలో ఒక్క మంచి పనయినా చేసిందా అని కూడా ప్రశ్నించారు. ఏడాదిపాటు రైతులను రోడ్లపాలుచేసిందన్నారు. కాళేశ్వరానికి ఇంకా లక్ష కోట్లు అవసరమయ్యేదన్న మంత్రి..ఈ ప్రాజెక్ట్‌ దర్వినియోగం కాలేదని సద్వినియోగం అయ్యిందని చెప్పారు. కాళేశ్వరం సకాలంలో నిర్మించడం వల్ల నిర్మాణ వ్యయాన్ని ఆదా చేశామని అన్నారు. అయితే కాంగ్రెస  హయాంలో ప్రాణహిత చేవెళ్లను దఫదఫాలుగా పెంచి తడిసి మోపెడు చేశారని అన్నారు. ప్రాజెక్టు పట్టాలకు ఎక్కకుండానే భారీగాఅంచనాలు పెంచారని అన్నారు.  కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 8ఏళ్ల పాలన సఫలం, సంక్షేమం, సామరస్యంగా ఉందని..కేంద్రానికి విఫలం, విషం, విద్వేషంగా ఉందని విమర్శించారు. దేశ ఆర్థిక స్థితి క్షీణిస్తోందని.. దేశం వృద్ధిరేటు 3శాతం తగ్గిందన్నారు. గతంతో పోలిస్తే డాలర్‌ విలువ 30 రూపాయలు పెరగిందని.. ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అసలు జీడిపీ పెరుగుతలేదు కానీ.. గ్యాస్‌ డీజిల్‌ పెట్రోల్‌ రేట్లు మాత్రం భారీగా పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. చర్చలో మల్లు భట్టి విక్రమార్క, రఘునందన్‌ రావులు పాల్గొన్నారు.