హైదరాబాద్: సభలో ఎలాంటి ప్రకటన చేయకుండా సభలో జాతీయగీతాలాపన ఎలా మొదలు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ సభ్యులను ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఎలా వ్యతిరేకమో కేసీఆర్ కుటుంబం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ గీతం ఆలాపన విషయంలో జరిగిన పొరపాటుపై సమగ్ర చర్చ జరగాలన్నారు.




