హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా కేవీపీ అడ్డుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునే ఆంధ్ర ప్రాంత నేతల ఇళ్ల ముందు సడక్‌బంద్‌ను నిర్వహించాలని ఆయన కోదండరామ్‌కు సలహా ఇచ్చారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన యాష్కీ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశమే లేదని స్పష్టం చేశారు.




