హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కార మార్గాలపై మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. లేఖలో మూడు ప్రత్యామ్నాయాలు సూచించారు. రెండో ఎస్సార్సీ, రాజకీయ – ఆర్థిక ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్థి మండలి ఏర్పాటు అంశాలను లేఖలో పేర్కొన్నట్లు గాదె మీడియాకు తెలియజేశారు.




