హైదరాబాద్ : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మోసం చేయదని కాంగ్రెస్‌పార్టీ సినీయర్‌నేత, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టు కుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో సామరస్యంగా విడిపోతే బాగుంటుందన్నారు. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల నేతలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల కోసం అబద్ధాలు అడాల్సిన అవసరం లేదన్నారు. విభజన జరిగితే తెలుగువారు మానసికంగా వేరుపడతారనేది అపోహమాత్రమే నన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠనం అలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.




