తెలంగాణపై మోడీ విద్వేషం బయటపడిరది
` పార్లమెంట్ వేదికగా అజ్ఞానంగా మాట్లాడిన ప్రధాని
` అందరినీ మోసపం చేయడమే మోడీకి అలవాటు
` తెలంగాణపై మాట్లాడుతుంటే బిజెపి ఎందుకు మౌనం
` సిగ్గుతో తలదించుకుని కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి
` పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగంపై రేవంత్ మండిపాటు
న్యూఢల్లీి,ఫిబ్రవరి 8(జనంసాక్షి):పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు సందర్బంగా కాంగ్రెస్ అధ్యోఉరాలు సోనియా సాహసంతో నిర్ణయం తీసుకుంటే దానిని ప్రధాని మోడీ అవహేళన చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. సోమవారం ఆయన పార్లమెంట్ వద్ద విూడియాతో మాట్లాడుతూ.. గతంలో చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్‌మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీది అని ఆయన ఆరోపించారు. ఒక్క ఓటు రెండు రాష్టాల్రుఅంటూ 1997 లో కాకినాడలో తీర్మానం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. మలి ఉద్యమంలో బలి అయిన అమరులకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారని, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విభజన కోసం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుందని రేవంత్ అన్నారు. తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారని, ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో బిల్స్ ఓటింగ్ జరగాల్సి వస్తే, సభ తలుపులు ముస్తారని, ఇది చట్ట పక్రియ అన్నారు. ఈ మాత్రం కూడా తెలియని అజ్ఞాని మన ప్రధాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను సైతం మోడీ వంచించాడని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. హామలు తుంగగలో తొక్కి ఏడుకొండవాడి సాక్షిగా మోసం చేసిన మోడీ బంగాళాఖాతంలో దూకి ప్రధాని ఆత్మహత్య చేసుకోవాలన్నారు. తెలంగాణా కోసం పదవి త్యాగం చేయకుండా, మోడీ వెనుక దాక్కున్న కిషన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇంతగా తెలంగాణ పట్ల అవహేన చేస్తే ఆయన కేబినేట్‌లో ఎందుకు కొనసాగాలో ఆలోచించుకోవాలని అన్నారు. మోడీ తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి అని నిరూపించుకున్నాడని రేవంత్ ధ్వజమెత్తారు. మోడీ మాట్లాడుతుంటే టీఆర్‌ఎస్ ఎంపీలు నోరెత్తటం లేదని, మోడీ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. మోడీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మోడీ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.