Tuesday, 3 November 2026

తెలంగాణపై మోసపూరిత వైఖరిని ఎండగడదాం

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణపై కేంద్ర హోం శాఖమంత్రి షిండే, మరోమంత్రి ఆజాద్‌లు చేసిన ప్రకటన మోసపూరితంగా ఉందని భారతీయ జనాతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి ఆరోపించారు. సోమవారం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తరచూ ఢిల్లీ వెళ్లి సాధించిందేమిలేదని విమర్శించారు. జనవరి 28న తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని  మంత్రి షిండే మళ్లీ దాటవేత వైఖరిని అవలంబించారని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రంలో అదనపు పోలీసు బలగాలను దించడం శోచనీమని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కిషన్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *