Tuesday, 3 November 2026

నేటి నుండి బోదకాల వ్యాధి నిర్మూలనకు ఉచిత మందుల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 28 (): బోదకాల వ్యాధి నిర్మూలనకు ఈ నెల 29 నుంచి 31వ తేదీవరకు ఉచిత మందుల పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హరినాథ్‌, జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య తెలిపారు. మూడు రోజుల పాటు చేపట్టే ఉచిత మందుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ప్రజలందరు సహకరించాలని కోరారు. రెండు సంవత్సరాల నుండి ఆపై వయసు ఉన్నవారందరికీ డిఇసి అల్‌బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 25,89,277 మందికి ఈ మందులను వేసే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందుకుగాను 8631 మంది కార్యకర్తలను, 863 మంది సూపర్‌వైజర్లను నియమించినట్టు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *