Friday, 6 November 2026

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోంది: టీటీడీపీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన టీడీపీ నేతలు అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా చేసిన ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నట్టు తెలిపారు. అలాగే పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని కోరునున్నట్టు పేర్కొన్నారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే అధికారం మండలి చైర్మన్‌కు లేదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైని టీడీపీ నేతలు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *