Wednesday, 4 November 2026

తెలంగాణలో కొనసాగుతున్న ఆత్మహత్యలు

హైదరాబాద్‌,  : తెలంగాణలో పంటలు వేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక, పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం తాటిపాములలో అప్పుల బాధతో రైతు శేఖర్‌రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్‌పాడులో అప్పుల బాధతో మరో రైతు సోమవారం ఆత్మహత్యలు చేసుకున్నారు. వరంగ ల్‌ జిల్లా భూపాలపల్లి మండలం కసింపల్లిలో అప్పుల బాధతో రైతు తిరుపతి ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వేస్టేషను సమీపంలో రైలు కిందపడి శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడు వర్ధన్నపేట మండలం నందనం వాసి అని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *