కర్నూలు కలెక్టరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, కర్నూలు జిల్లాలోని బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.‘‘మీ పిల్లలు ప్రభుత్వ బాలికల స్కూళ్లలో చదవడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారా ? ’’ అంటూ హైకోర్టు కర్నూలు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబరు 2న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు కలెక్టరును ఆదేశించింది.