హుజూర్ నగర్ జూన్ 13 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సంబూరాలలో భాగంగా మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిరజిత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పూర్వం ఎన్నో రంగాలలో మహిళలు వెట్టి చాకిరీ చేస్తూ, తమ జీవితాలను దుర్భరంగా ఆశతో జీవించారని ఆయా ప్రభుత్వాలు ఆశపెట్టి ఎన్నో సంవత్సరాల నుండి గోడ్డు చాకిరీ చేయించుకుంటూ చాలీచాలని జీతాలు ఇచ్చి అదే చాలీచాలని జీవితంతో కూడా రిటైర్మెంట్ అయినటువంటి ఎంతోమంది మహిళా ఉద్యోగులు ఉన్నారని, కానీ నేడు తెలంగాణ ఆవిర్భవించినాక తెలంగాణ కలను సహకారం చేసుకున్నాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నో రంగాలలోని మహిళలకు చెప్పుకోదగిన వేతనాలను అందించి వారి జీవితంలో చిగురాశలను రేకెత్తించి, భవిష్యత్తుపై నమ్మకాన్ని అందించి ఆత్మవిశ్వాసంతో తిరిగి తమ జీవితాలను అద్భుతంగా జీవించేలా చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని రంగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారికి సమస్త స్థానాన్ని అందించి సమాజంలో మేము సైతం అనేలా మహిళలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా గర్భిణీ స్త్రీలకు ప్రసవించే వరకు కూడా గర్భస్థ శిశువును, తల్లి ఆరోగ్యాన్ని ప్రతి నెల నెల కాపాడుకుంటూ పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ డెలివరీ అయినాక కేసీఆర్ కిట్ని కూడా అందిస్తూ, ఆ తర్వాత ఆడపిల్ల పుడితే పెళ్లి చేసేటప్పుడు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మేనమామ కట్నం అందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేననన్నారు. అదేవిదంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 11 గురుకుల పాఠశాలలు, కళాశాలలు అత్యంత అద్భుతంగా పనిచేస్తూన్నాయని, హుజూర్ నగర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన వైష్ణవి దేవి 991 మార్కులతో రాష్ట్రంలోనే ప్రధమంగా నిలిచి హుజూర్ నగర్ పేరును చాటిచెప్పిందని, ఇదే కళాశాలకి అదే కళాశాలలో మరొక విద్యార్థిని లక్ష్మి కూడా రాష్ట్ర ర్యాంకులను సాధించి ఆడబిడ్డల ప్రతిభాపాటవాలను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా నేడు అన్ని రంగాలలో మహిళలు తమ శక్తి యుక్తులను ప్రదర్శించి ఆయా రంగాలలో ఉన్నత శిఖరాలను అందుకునేలా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తూ మహిళలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వైభవంగా చేయడం జరిగింది. ఎమ్మెల్యే సతీమణి శానంపూడి రజితసైదిరెడ్డి చేతుల మీదుగా, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి గర్భిణీ మహిళలకు సీమంత కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం శాసనసభ్యలు శానంపూడి సైదిరెడ్డిరజిత దంపతులు అక్షర అభ్యాస కార్యక్రమంలో నూతనంగా బడికి వెళ్లే పిల్లవానికి అక్షర అభ్యసమును దిద్దించారు. పసిబిడ్డకు అన్న ప్రసన్న తమ చేతుల మీదుగా గావించారు.
మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలలో అద్భుత ప్రతిభ పాటలను ప్రదర్శించి కష్టపడి పని చేస్తున్నటువంటి మహిళా ఉద్యోగినులకు అవార్డులు పురస్కారాలు ప్రధానం చేస్తూ సన్మానించడం జరిగింది. మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం మొదటి నుండి అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, పాటల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, పౌష్టికాహార వివిధ రూపాలను ప్రత్యక్షంగా తయారు చేసి ప్రదర్శించడం జరిగింది.
ఐసిడియస్ ఫోటో ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నది. మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులాల చేతివృత్తుల వారికి లక్ష రూపాయల పథకాన్ని ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. మొదటగా ఆరుగురు బిసి చేతివృత్తుల వారికి లక్ష రూపాయల చెక్కును ఆయా లబ్ధిదారులకు అందించడం జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మహిళ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి అశేషంగా హాజరై కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు పేరుపేరునా ఈ సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. భారీగా బతుకమ్మలతో మహిళలు, పలు శాఖల మహిళా అధికారులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చన, మఠంపల్లి ఎంపీపీ పార్వతి, పట్టణ బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, నేరేడుచర్ల వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, హుజూర్నగర్ ఎంపీడీవో శాంత కుమారి, తాసిల్దార్ వజ్రాల జయశ్రీ, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, జగన్ నాయక్, కొండానాయక్, మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాలు, వివిధ శాఖల మహిళ అధికారులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు – కన్నుల పండుగగా మహిళా సంక్షేమ దినోత్సవం – మహిళ లేనిదే -సృష్టి లేదు




