కొడంగల్ జూన్13(జనం సాక్షి):- వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బోంరాస్ పేట్ మండలం రేగడి మైలారం గ్రామంలో పెళ్లి వేడుకల్లో తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభ రాణి హాజరై నూతన వధూవరులకు కానుకలు సమర్పించారు. తాండూరు మున్సిపాలిటీ ఉద్యోగి ఎం.వెంకటేష్ కూతురు పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. కొత్త బట్టలు సమర్పించి పెళ్లికూతురును ఆశీర్వదించారు. మహిళ నేతలను సాంప్రదాయం దుస్తులతో స్వాగతించి గౌరవించారు. ఈ వేడుకల్లో శ్రీనివాస్ తదితరులు గ్రామ వాసులు పాల్గొన్నారు.
పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మహిళ బిఆర్ఎస్ నేతలు




