Tuesday, 3 November 2026

తెలంగాణలో రుణమాఫీ..!

తెలంగాణ ప్రభుత్వం మరోదఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ.2019.19కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు దశల్లో నిధులు విడుదల చేయగా ఇవి మూడో దశలో రెండో విడత రుణమాఫీ నిధులుగా ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.17వేల కోట్లు రుణాల e87b9e62d7c7d249d4854c57b58d291d_mమాఫీకి నిర్ణయం తీసుకుంది. రుణాలను నాలుగేళ్లలో చెల్లించాలని, ఏటా రూ.4250 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో మొదటి ఏడాది ఒకేసారి రూ.4250 కోట్లు విడుదల చేశారు. రెండో ఏడాది నుంచి రెండు దశల్లో రుణాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. గతేడాది సెప్టెంబర్ లోపే చెల్లించగా ఈ సంవత్సరం కొంత ఆలస్యమైంది. మొదటి దఫా కింద రూ.2100కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను ఈరోజు విడుదల చేసింది. మొత్తం రూ.2019.19కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *