హైదరాబాద్ : బయ్యారం గనులను ఉపయోగించుకుని తెలంగాణ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్స్‌కు బయ్యారం గనులను తరలిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రాంతంలో ఖనిజసంపద దోచుకోవడానికి కిరణ్ సర్కారు ప్రయత్నిస్తుందని వినోద్ విమర్శించారు.




