విశాఖ : వైఎస్ ,జగన్‌లు గజనీని మించిన ఘనులని తెదేపా ఆధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ మహ్మద్ గజనీ బంగారాన్ని ,సంపదను దోచుకుంటే వీళ్లు భూములను ,గనులనూ కూడా వదిలిపెట్టలేదన్నారు. వైఎస్ అనుచరుల కోసం విశాఖ ఏజన్సీలో వేలకోట్ల విలువ చేసే బాక్సైట్ గనులు కేటాయించారని ,అనుచరుడు పెన్నా ప్రతాప్‌రెడ్డి పరిశ్రమ కోసం వేల ఎకరాల పేదల భూములు లాక్కున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వస్తే భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు.




