తెలంగాణవాదుల అరెస్టు
రామకృష్ణాపూర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమ నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ఐకాస, తెరాస, సీపీఐ, భాజపాలకు చెందిన 15 మంది నేతలను అరెస్టు చేశారు.



