తెలంగాణాలో బిఆర్ఎస్ కు కాలం చెల్లింది

బీజేపీ కర్నాటక హుబ్లీ శాసనసభ్యులు మహేష్ తంగినకై కొడకండ్ల, ఆగస్టు 22(జనం సాక్షి ): అవినీతిలో కూరుకపోయినా బిఆర్ఎస్ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు, మేధావులు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని బీజేపీ కర్నాటక రాష్ట్ర హుబ్లీ శాసనసభ్యులు మహేష్ తెంగినకై అన్నారు. కొడకండ్ల మండలకేంద్రంలో జరిగిన మండలసమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్ రావు తోనే తెలంగాణాలో బిఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతుందని అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రవాస యోజన కొడకండ్ల మండల కార్యకర్తల సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షులు పులుగిల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో కొడకండ్ల లో భారీ బైక్ ర్యాలీ లో నిర్వహించగా హుబ్లీ సెంట్రల్ ఎమ్మెల్యే మహేష్ తెంగినకై పాల్గొన్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోవు ఎలక్షన్ లో పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలోకి తీసుకొనిపోవాలని,నియోజక వర్గంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదగానీ సోమయ్య, లేగ రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతుల ఇంఛార్జి పాకనాటి దామోదర్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, జాయింట్ కన్వీనర్ సుంకర్ నేని కోటేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్, జిల్లా కార్యదర్శి మోడపల్లి సోమన్న, సాయిని ఝాన్సీ ,రచ్చ కుమార్ , పాలకుర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి నలబాల వెంకన్న,ముంజల శ్రీనివాస్, శ్రీను నాయక్, సాయి దుర్గ, ఉప్పల మహేష్, గుగులోతు శ్రీను నాయక్, జి వనిత, సుంకరనేని సాయి,గుగులోతు వాసు నాయక్, వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.