ఉచితషుగర్, బిపి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి రమేష్ మిర్యాలగూడ,జనం సాక్షి. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో వర్షిత హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత షుగర్, బీపీ వైద్య శిబిరంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షుడు కర్నాటి రమేష్ కోరారు. మంగళవారం వైద్య శిబిరాన్ని లయన్ డాక్టర్ జాడీ రాజు ప్రారంభించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాస్ క్యాంపు చైర్మన్,వర్షిత హాస్పిటల్ ఎండి కూటాల రాంబాబు తో కలిసి కర్నాటి రమేష్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ఈనెల 30 వరకు అశోక్ నగర్ సమీపంలో గల వర్షిత హాస్పిటల్ నందు నిర్వహిస్తారని తెలిపారు. మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు శిబిరాన్ని సందర్శించి, ఉచిత పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
బి. ఎం. నాయుడు, లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎనగండ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.