తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కు ఆర్హత సాధించిన ప్రవళిక
జహీరాబాద్ జనవరి 14( జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రం లో జిల్లా ఉన్నత స్థాయి అధికారి ఉద్యోగాల నిమిత్తం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం టి.ఎస్.పి.ఎస్.సి ద్వారా ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు జహీరాబాద్ పట్టణ బాగరెడ్డి పల్లి కి చెందిన గడ్డి ప్రవళిక కష్టపడి చదివి ప్రిలిమ్స్ పస్ అయ్యి మెయిన్స్ పరీక్ష కు అర్హత సాధించింది. అర్హత సాధించిన ప్రవళిక మాట్లాడుతూ మెయిన్స్ కు అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కష్టపడి చదివితే ఏదైనా సాధించగలం అనే సంకల్పం తో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రం లొ ఉద్యోగం సాధిస్తానని , ఉద్యోగావకాశాలు కల్పించిన కే.సీ.ఆర్ ప్రభుత్వానికి యువత తరపున ధన్యవాదాలు తెలిపారు..
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కు ఆర్హత సాధించిన ప్రవళిక




