వాసవిక్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు
సంబరాల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి): సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలు,సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు బెలిదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో ఏర్పాటు చేసిన భోగిమంటలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్లబ్ సభ్యులతో కలిసి సంబరాలలో పాల్గొన్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని పండుగలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,కౌన్సిలర్లు తాహెర్, భరత్, వాసవిక్లబ్ సభ్యులు మీలా వాసుదేవ్ , తోట శ్యామ్ ప్రసాద్ , సింగిరికొండ రవీందర్, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీను వనితాక్లబ్ అధ్యక్షురాలు కలకోట అనిత, బెలిదె రాధ, చల్లా లక్ష్మయ్య , భోనగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




