Wednesday, 4 November 2026

తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అమరవీరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం అమరవీరుల కుటుంబాలకు సన్మానం

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,  జూన్ 22 :.అమరవీరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన  జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను అర్పించారని, అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైందన్నారు. అమరుల  త్యాగాలను వెలకట్టలేమని అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  అమరులను స్మరించుకునేందుకు ఈరోజు ప్రత్యేక సమావేశం జిల్లా పరిషత్ లో ఏర్పాటుచేసి ప్రత్యేక తీర్మానం చేయడం జరిగిందన్నారు.అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్  కుటుంబాలకు అండగా నిలిచారన్నారు.పిమ్మట అమరవీరుల సంస్మరణ తీర్మానంచేసి సభ్యులు సంపూర్ణ ఆమోదం తెలిపారుఅనంతరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గల అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించి, కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలను ఓదార్చుదామన్నారు. వారిలో ఉన్న బాధను తీర్చలేమని,వారికి అండగా ఉందామన్నారు. తెలంగాణ కోసం వారు కన్న కలలు,ఆశయాలను నెరవేర్చేలా అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటున్నా మన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు.ముందుగా అమరవీరుల జ్ఞాపకార్థం రెండునిమిషాలు మౌనం పాటించారు.అదనపు కలెక్టర్  వీరారెడ్డి మాట్లాడుతూఅమరుల త్యాగం వల్లనే తెలంగాణ సాధించుకున్నామని, వారి త్యాగఫలమే తెలంగాణ అభివృద్ధికి మూలమన్నారు. వారి త్యాగాలకు అందరము రుణపడి ఉంటామన్నారు.ఈ సమావేశంలో  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, శాసనసభ్యు లు మాణిక్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.