Wednesday, 4 November 2026

అమర వీరులందరు చిరస్మణీయులు.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 22నాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి అమరులైన వారందరూ చిరస్మణీయులని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు.మౌలాలి డివిజన్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ అమర వీరుల సంస్కార దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జెండా ఆవిష్కరణ చేసి అమర వీరుల స్టుపాన్ని ప్రారంభించడం జరిగింది. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన చేసిన అమరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసిఆర్ అండగా నిలిచి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించిన వారందరూ చిరస్మరీయులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,నాయకులు బద్దమ్ పరశురాం రెడ్డి,ఎండి ఉస్మాన్,ఆమీనుద్దిన్,సతిష్ కుమార్,గుండా నిరంజన్,రామూయాదవ్,ఉపేందర్ రెడ్డి, భాగ్యనంద్ రావు,సంతోష్రాందాస్,మోహన్రెడ్డి,శేఖర్గౌడ్,నహీంఖాన్,జోగుశ్రీనివాస్,ఆదినారాయణ,ఉపేందర్,సంతోష్ నాయుడు, సంతోష్ గుప్త,నరేష్ కుమార్,నవీన్ యాదవ్, ఉషశ్రీ,చందు,మంద భాస్కర్,కృష్ణ మూర్తి గౌడ్,సూరి,బాలకృష్ణ గుప్త,సత్యమూర్తి,బ్రమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.