Wednesday, 4 November 2026

తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్22.
తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరియు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2023 చివరి రోజులో భాగంగా ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ టి డి ఏ ఏటూరునాగారం అంకిత్ ఐఏఎస్, ఐ టి డి ఏ ఆవరణలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు తెలంగాణ అమరవీరులకు మౌనం పాటించారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ అంకిత్ మాట్లాడుతూ అమరవీరులకు గౌరవ సూచకంగా మరియు తెలంగాణ అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన దార్శనికులు, నాయకులు మరియు పౌరులను స్మరించుకోవడం మరియు వారి ఆశయాలను కొనసాగించడానికి మనం అందరం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ పి ఓ(జి) జె. వసంతరావు,డిడి టి డబ్ల్యు పోచం, ఏఓ టి వి ఆర్ దామోదర స్వామి, ఎస్ఓ యం. రాజ్ కుమార్, పిహెచ్ఓ బి.వి. రమణ, పి ఏ ఓ జేవీఎస్‌డీ భారతి, ఏఏవో శ్రీ ఆర్‌. సంతోష్‌, డీఎం జీసీసీ జి. ప్రతాప్‌రెడ్డి, మేనేజర్లు వి.శ్రీనివాస్‌, నర్సింగ్‌, డీఎస్‌వో బి. లాల్‌, జేడీఎం ఎం. కొండల్‌రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.