Wednesday, 4 November 2026

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో సీటు సాధించిన సిద్ధార్థ విద్యార్ధి

జనం సాక్షి,చెన్నారావుపేటమండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల విద్యాలయం చెందిన కొండపర్తి రిషిక్ అనే విద్యార్థి నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో సీటు సాధించినట్లు సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కృషి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు అన్నారు. ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యం నెరవేర అంటే చదువుల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పాఠశాలలో నవోదయ పరీక్షలపై ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అండే0 కరుణాకర్ రెడ్డి, జక్కుల జగదీశ్వర్,మేడి రమేష్ గౌడ్ కొండపర్తి కృష్ణమోహన్, పొన్నం రమేష్ ,ఆరే రాజు,బాదావత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.