భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, ,తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ల మన ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తల్లి మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సకారం చేసిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుందని తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వరాష్ట్ర సాధనకై ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు చలించిపోయి అమ్మ సోనియా ఇచ్చిన వరం తెలంగాణ సాధించుకుంది రైతు బిడ్డలకు సంకెళ్లు వేసి జైలులో పెట్టడమా ఈ తెలంగాణ అని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేర్చావని, సకలజనుల సమ్మె ద్వారా తెలంగాణ తల్లికి సంకెళ్లను తొలగించావని, కాలాన్ని పార్లమెంట్లో బంధించి తెలంగాణని ప్రసవింపజేసిన తల్లి సోనియా గాంధీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నక్కల ఆదినారాయణ బెండే లాల్ రాజ్ ,బీస్కుంట్ల సత్యనారాయణ ,కుక్కదుగు సోమయ్య చల్లగురుల రఘు బాబు, పిట్టల బాలరాజు కూర వెంకటేష్,ఎండి మజార్ అంగడి నాగరాజ్ సయ్యద్ రషీద్ హుస్సేన్ తాడూరి నరసింహ మాటూరి అచ్చాలు కృష్ణ యాదవ్ ఎండి సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్ చిక్కుల వెంకటేష్ ,బెండ శ్రీకాంత్ ,పోకల యాదగిరి ,ఎండి ఆబిద్ అలీ ,వలదసుఆదినారాయణ కొండల్ రెడ్డి ఎండి ఏజాజ్ గాజుల కుమార్ మాదాసు గోవర్ధన్ ఎండి నజీర్ రమేష్ శివానంద్ ఎండి బుర్హాన్ అఫ్రోజ్ జుట్టిమల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




