వికారాబాద్ రూరల్ జూన్ 2 జనం సాక్షి
తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగు తూ ఉన్నప్పటికీ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందన్నారు రెండుసార్లు ప్రధాని పదవికి అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని పదవిని త్యాగం చేసిన వీర వనిత సోనియా గాంధీ అని ఆయన అన్నారు తెలంగాణ ప్రాంత ప్రజల దేవతగా తెలంగాణ ప్రజల గుండెల్లో సోనియా గాంధీ ఎప్పటికీ నిలుస్తారని అన్నారు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ లతోపాటు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియాగాంధీకి రుణపడి ఉండాలి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్




